పోస్ట్ మేన్ ....
అందరికీ సుపరిచితమైన పదమే
అందరికీ పరిచయం ఉన్న మనిషే
అందరికీ ఏదో ఒకటైం లో అవసరవుడే ఉద్యోగే
అలాంటి పోస్ట్ మేన్ గురుంచి ఒక్కమాటలో చెప్పాలంటే కష్టమే
ఉత్తరాలు పంచేవాడే పోస్ట్ మేన్ అని మనం అనుకుంటున్నాం
కానీ ఉత్తరాలతో పాటు ప్రేమగా పలకరిస్తూ ఆనందాన్ని ఆప్యాయతని అందరికి పంచే అందరివాడే పోస్ట్ మేన్
మన అనుకున్నవాళ్ళు పలకరించినా పలకరించకపోయినా
రోజూ సంతోషంగా చిరునవ్వుతో నమస్తే బాగున్నారా అని పలకరించేవాడే పోస్ట్ మేన్
పావలా పోస్ట్ కార్డ్ లో ఉభయ కుశలోపరి ఇచ్చట మేము క్షేమం...అచ్చట మీరు అందరూ క్షేమం అని తలుస్తున్నాను.....
అనే రోజుల నుండి నేడు ఈ-పోస్ట్ ల కాలం వరకు
అలుపెరగకుండా నిర్విరామంగా వార్తలను చేరవేసే రాయబారే పోస్ట్ మేన్
మండే ఎండాకాలంలో అయినా
కుండపోత వర్షాకాలంలో అయినా
దారులు లేని కొండ ప్రాంతాలలో అయినా
అలుపెరగని నిరంతర శ్రమజీవి పోస్ట్ మేన్
ఎక్కడో ఢిల్లో నుండి గల్లీకైనా గల్లీ నుండి ఢిల్లీకైనా పోస్ట్ చేసినా లెటర్ తీసుకొచ్చి అందజేసే ఒకేఒక ఉద్యోగి పోస్ట్ మేన్
ప్రభుత్వ ఉద్యోగి అన్న గర్వం లేకుండా
మన కుటుంబం లో మనిషిలా
మనతో కలిసిపోయే మంచి మనసున్న మనిషి పోస్ట్ మేన్
ట్రంకు ఫోను నుండి మొబైల్ ఫోన్ కి మారినా
2G నుండి 5G కి మారినా
అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ప్రతీరోజు ప్రజల మధ్య తిరిగే ఏకైక ప్రభుత్వోద్యోగి పోస్ట్ మేన్
రాసిన వారు r.v. సత్యనారాయణ ,పోస్ట్ మాన్,ఆర్యాపురం so.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి