*డియర్ కామ్రేడ్స్,*
*ఈ రోజు పి3,పి4,జిడిస్ సంయుక్త ద్వెవార్షిక మహాసభ సుమారు 130 మందితో ఆహ్లాదకరమైన వాతావరణంలో గేదెల నూకరాజు కల్యాణ మండపంలో కన్నులపండుగగా జరిగింది.జెండా వందనం తరువాత అఖిల భారతఉద్యోగ సంఘాల నాయకులు,రాష్ట్ర స్థాయి నాయకులు సభలో పాల్గొని ప్రసంగించారు.తరువాత మన రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరత్ రాం గారు,మన డివిజన్ సూపరెండేంట్ గారు సభకు విచ్చేసారు.ఈ సందర్భంగా మన డివిజన్ పరిధిలోని ప్రధానమైన మూడు సమస్యలను ఎంపీ గారికి విన్నవించి ఆయనకు వినతిపత్రం సమర్పించడం జరిగింది.ఆయన సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.భోజన విరామం అనంతరం పి3,పి4,జిడిస్ కార్యదర్సుల నివేదిక, ఆదాయ,వ్యయాల పట్టిక సభకు సమర్పించడం జరిగింది.ఆ తరువాత జరిగిన నూతన కార్యవర్గం ఎన్నికల్లో పి3 యూనియన్ నుండి అధ్యక్షుడిగా శ్రీ యు.జి.ప్రకాష్, కార్యదర్శిగా శ్రీ బి.కొండబాబు,కోశాధికారిగా ఐ.యెస్.వి.ఎం తాతాజి మరియు వారి కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.రానున్న రెండు సంవత్సరాలు మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తూ ఈ సభ విజయవంతం అవ్వడానికి కారణమైన ప్రతీ ఒక్కరికీ,ముఖ్యంగా అఖిల భారత,రాష్ట్ర స్థాయి ఉద్యోగ సంఘాల తాజా,మాజీ నాయకులకు,మన సూపరెండేంట్ గారికి,ఎంపీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ*
*విప్లవాభివందనాలతో*
*మీ*
*బి.కొండబాబు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి