*/✊బోనస్ పై పోరు✊/*
*కామ్రేడ్స్,*
*దుర్గాపూజకు ముందే ఏటా చెల్లించే ఉత్పాదకతతో కూడిన బోనస్‌ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించలేదు.ఎన్నో పోరాటాల తరువాత బోనస్ హక్కును సాదించగలిగాము.ఈ హక్కును కేంద్ర ప్రభుత్వం మనకు దూరం చేయడానికి చూస్తుంది.ఇప్పటికే ఒకటిన్నర సంవత్సరాల పాటు మన హక్కు అయిన కరువు భత్యాన్ని మనకు దూరం చేసింది.ఇప్పుడు బోనస్ ని కూడా దూరం చెయ్యడానికి చూస్తుంది.దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ మనం దూరం చేసుకోకూడదు.బోనస్‌కు సంబంధించిన ఫైల్‌ను పోస్టల్ డైరెక్టరేట్ కేంద్ర సమాచార, ప్రచార మంత్రిత్వ శాఖకు పంపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టింపులేనట్టు వ్యవహరిస్తోంది.ఈ వ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా NFPE కేంద్ర కమిటీ ఆదేశాలనుగుణంగా ఈ నెల 20వ తేదీ అనగా మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు మన రాజమండ్రి ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట ఉద్యోగులకు బోనస్ ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో బోనస్ కావాలనుకునే వారు తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను.మనమందరూ ఐక్యంగా పోరాడితేనే మన హక్కులను సాదించుకోగలం. మనకెందుకులే అనుకుంటే మనకు స్వాతంత్రం వచ్చేదే కాదు.అందువల్ల మనకెందుకులే అనుకోకుండా ప్రతీ ఒక్కరూ ఈ నిరసన కార్యక్రమాలలో పాల్గొనవలసిందిగా మరీ మరీ కోరుతున్నాను.*
*"పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్లు తప్ప"*
*విప్లవాబివందనలతో*
*మీ*
*బి.కొండబాబు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి