FLASH

tml"/>Get this Widget"WELCOME TO OUR UNION BLOG "
tml"/>Get this Widget" యూనియన్ వార్తలు, గవర్నమెంట్ ఆర్డర్స్ ,సర్కులర్స్,లేటెస్ట్ న్యూస్ ల తో మీ ముందుకు వస్తున్నాము.మీ యొక్క మద్దత్తు కోరుతూ మీ సెక్రటరీ [KONDABABU] "

8, మార్చి 2021, సోమవారం

press note on women's day celebrations

*అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని  NFPE యూనియన్ ఆధ్వర్యంలో తపాలా శాఖలో  రాజమండ్రి  డివిజన్ పరిధిలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రాజమండ్రి ప్రధాన తపాలా కార్యాలయం వద్ద  మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా  రాజమండ్రి డివిజన్ సూపరింటెండెంట్ సిహెచ్.సూర్యనారాయణ,అసిస్టెంట్ సూపరింటెండెంట్లు కె. శ్రీధరం,జి.రామకృష్ణ,హెడ్ పోస్టుమాస్టార్ అప్పారావు గారు పాల్గొని అంతర్జాతీయ మహిళ దినోత్సవ విశిష్టతను తెలియచేసారు.NFPE మహిళా కన్వీనర్ ప్రసూనాంబ గారు మాట్లాడుతూ మహిళల గొప్పతనాన్ని వివరించారు.NFPE మహిళా కమిటీ ట్రెజరర్ శ్రీమతి గంటా రాజేశ్వరి గారు తన గానామృతంతో సభికులను అలరించారు.ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా రాజమండ్రి ప్రధానతపాలా కార్యాలయం,దానవాయిపేట,ఆర్యాపురం,శ్రీరామ్ నగర్,గోకవరం,రామచంద్రపురం,మండపేట,అనపర్తి కార్యాలయాలలో అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని  ఘనంగా నిర్వహించారు.*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి