*/పత్రికా ప్రకటన/*
*తపాలా శాఖలో ఎన్నో ఏళ్లుగా ఆవిష్కృతంగా ఉన్న సమస్యలపై సమర శంఖాన్ని పూరిస్తూ NFPE ఆధ్వర్యంలో ఉద్యోగులు ఈరోజు రాజమండ్రి డివిజినల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మారేడుమిల్లి,రంపచోడవరం ,కొత్తపల్లి,మండపేట,రామచంద్రపురం లాంటి సుదూర ప్రాంతాల నుండి జిడిఎస్,పి4,పి3 సభ్యులు వచ్చి ధర్నాలో ఉత్సహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మూర్తి,LIC ప్రధాన కార్యదర్శి సతీష్ వచ్చి ఉద్యోగుల ధర్నాకు సంఘీభావం తెలిపారు.కేంద్ర పాలకులు అవలంభిస్తున్న ప్రైవేటీకరణ విధానాలపై సవివరంగా వివరించారు.NFPE అనుబంధ సంఘం అయిన ఆల్ ఇండియా పెన్షనర్ అసోసిషన్ కార్యదర్శి తిరుపతి రావు గారు పాల్గొని ధర్నాకు మద్దతు తెలిపారు.NFPE పి3 డివిజన్ కార్యదర్శి కొండబాబు మాట్లాడుతూ నోట్ల రద్దు సమయంలో పనిచేసిన ఉద్యోగులకు ప్రత్యేక భత్యం ఇవ్వాలని,కోవిడ్ కారణంగా మరణించిన ఉద్యోగులకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని,టార్గెట్ల పేరిట జిడిస్,పోస్టుమాన్ ఉద్యోగులను వేధించడం ఆపాలని,నెట్వర్క్ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో NFPE పి4 కార్యదర్శి జె.వి.సతీష్,అధ్యక్షులు శ్రీనివాస్,పి3 కార్యదర్శి కొండబాబు,అధ్యక్షులు యూ.జి.ప్రకాష్ ,జిడిస్ కార్యదర్శి పుష్కరం,అధ్యక్షులు లక్ష్మణరావు,రామచంద్రపురం బ్రాంచ్ పి3 కార్యదర్శి రమణ మూర్తి, అధ్యక్షులు జి.శ్రీనివాస్, పి4 కార్యదర్శి బాబ్జి,అధ్యక్షులు ఈశ్వర రావు,జిడిస్ కార్యదర్శి ఎండి షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి