FLASH

tml"/>Get this Widget"WELCOME TO OUR UNION BLOG "
tml"/>Get this Widget" యూనియన్ వార్తలు, గవర్నమెంట్ ఆర్డర్స్ ,సర్కులర్స్,లేటెస్ట్ న్యూస్ ల తో మీ ముందుకు వస్తున్నాము.మీ యొక్క మద్దత్తు కోరుతూ మీ సెక్రటరీ [KONDABABU] "

11, మార్చి 2021, గురువారం

Postman

పోస్ట్ పోస్ట్ ‌ అని పిలుస్తూ
సైకిల్‌ బెల్‌ గణగణ మోగిస్తూ

సొంత వాడిలా పలకరిస్తూ
ఉత్తరాలని చదివి వినిపిస్తూ

పెదాలపై చిరునవ్వు చిందిస్తూ
శుభ వార్తలను చేరవేస్తూ

పల్లె పల్లెల్లో ప్రతీరోజూ ప్రతీ గుమ్మం తలుపు తడుతూ 
ప్రతీ వీధిలో పోస్ట్ మేన్ తిరిగిన రోజులు

కొన్నాళ్ల క్రితం వరకు మన కళ్ళ ముందు కదలాడుతూ ఉండేవి...


ఫేస్ బుక్ లో పోస్టులు పెడుతూ
వాట్సాప్ లో స్టేటస్ లు పెడుతూ

ఆన్లైన్లో వార్తలు చదువుతూ
అర నిమిషం లో డబ్బులు పంపుతూ

అరచేతితో ప్రపంచాన్ని ఏలుతూ
హోమ్ డెలివరీ కి అలవాటు పడుతూ

దేనికోసమైనా గూగుల్ తల్లినే అడుగుతూ కదులుతున్న రోజులు మన కళ్ళ ముందు కదులుతున్నాయి... కదులుతూనే ఉంటాయి.

రోజూ కోట్లాది ఉత్తరాలు, మని ఆర్డర్లు,పార్శిళ్ల బట్వాడా ద్వారా జనజీవితంతో మమేకమైన తపాలా వ్యవస్థ ....అంతర్జాలం, చరవాణుల సాంకేతిక విప్లవం తో నిన్న మొన్న వరకు ఒక అడుగు వెనక్కి ఉందనే చెప్పుకోవచ్చు.

కానీ ...

నేడు ఈ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నుంచి తిరిగి తేరుకుని కొత్త శక్తి పుంజుకుని తపాలా శాఖ ముఖచిత్రం మార్చడానికి  నాంది పలుకుతుంది

మన.... ఇండియా పోస్ట్

పల్లెల నుండి పట్నం వరకు ప్రతీ భారతీయుని ఇంటి వద్దకు నూతన సాంకేతిక విజ్ఞానంతో అన్ని రకాలా తపాలా సేవలను అందించడానికి సంసిద్దమవుతోంది మన " ఇండియా పోస్ట్".

మారుతున్న కాలంతో పాటు మిగతా అన్ని సంస్థలకు గట్టి పోటీ ఇస్తూ మేము తక్కువ కాదు అంటూ అక్షరాస్యుల అరచేతి లోనే కాదు నిరక్ష రాస్యుల ఇంటి వాకిట ముందు కూడా నిరంతరంగా సేవలను అందించడానికి సిద్దమైంది మన"" ఇండియా పోస్ట్""

ఎప్పుడూ.... 
        ఇప్పుడూ....
                ఎప్పుడూ....

ప్రతీ క్షణం ప్రజా సేవలో.... ఇండియా పోస్ట్


🇮🇳జై హింద్🇮🇳

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి