అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్-సి,
ఆంద్రప్రదేశ్ శాఖ
A-1P&T క్వార్టర్స్
విజయవాడ-5200010
--------------------------------------------------
తేదీ.14.12.2020
డియర్ కామ్రేడ్స్!
ఢిల్లీ లో జరుగుతున్న రైతు ఉద్యమానికి ఆర్థిక సహాయం చేయాలని AIPEU Group -C, రాష్ట్రసంఘం నిర్ణయం
AIPEU Group - C, రాష్ట్ర సంఘం కార్యవర్గ సమావేశం తేదీ 13.12.2020 సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు గూగుల్ మీట్ ( online) లో జరిగింది. ఈ సమావేశాన్ని కామ్రేడ్ DASV ప్రసాద్ గారు మాజీ రాష్ట్ర కార్యదర్శి ప్రారంభించారు. ఈ మావేశములో అజెండా ప్రకారం ఈ క్రింద విషయలను చర్చించి నిర్ణయాలు చేయడం జరిగింది.
1) 26 నవంబర్ 2020 ఒక్క రోజు సమ్మె, 2) పోస్టల్ యూనిటీ ప్రచురణ, 3)యూనియన్ భవన నిర్మాణము, 4) ఢిల్లీ లో జరుగుతున్న రైతుల ఉద్యమానికి ఆర్థిక సహాయం.
నిర్ణయాలు
నవంబర్ 26 ఒక్క రోజు సమ్మెను ప్రతి డివిజన్ లో విశ్లేషించుకుని, ఖచ్చితమైన పూర్తి సమ్మె వివరాలును మరియు సమ్మె శాతాన్ని అకౌంట్స్ సెక్షన్ నందు తీసుకొనవలెను.మరియు పూర్తి వివరాలను రాష్ట్ర సంఘము కు పంపవలెను.
ఢిల్లీ లో జరుగుతున్న రైతుల పోరాటానికి ఆర్ధిక సహాయముగా ప్రతి డివిజన్ నుండి Rs 5000 /- ప్రతి బ్రాంచ్ నుండి Rs 3000 /- విరాళాలు స్వచ్చందంగ ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. విరాళాలు పైన ఎటువంటి నిర్బంధం లేదు.(సూచించిన అమౌంట్ కన్నా ఎక్కువైనా, తక్కువైనా ఇవ్వకపోయినా) మీరు వీలుఅయన మేరకు ఎక్కువ మంది సభ్యులను ఈ ఆర్ధిక సహాయంలో పొల్గొనేటట్లు చూడాలి. తద్వారా ఎక్కువ మందిని మనము ఈ ఉద్యమములో భాగస్వామ్యము చేసినవారము అవుతాము.కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేఖమైన మూడు వ్యవసాయ చట్టాలునూ , విధ్యుత్ బిల్లులు తీసుకొచ్చింది. వీటివలన వ్యవసాయం కార్పొరేటీకరణ అవుతుంది. ఈ దేశానికీ అన్నం పెట్టె రైతాంగము దివాళా తీస్తుంది, మద్దతు ధరలు , ప్రభుత్వ కొనుగోలు సంస్థలు నిర్వీర్యం అవ్వుతాయి.నిత్యఅవసర ధరలు పెరుగుతాయి.ఆహార పంటలు బదులు డాలర్ల సంపాదన కోసం వాణిజ్య పంటలు ప్రోత్సహించబడుతాయి.ఇది మన దేశ ప్రజల ఆహార భద్రతకు ప్రమాదముగా మారుతుంది. విద్యత్ రంగం ప్రైవేటీకరించబడి, ధరలు అమాంతముగా పెరుగుతాయి. మనము తపాలా ఉద్యోగాల కంటే ముందు మనము ఈ దేశ ప్రజలము,మనమందరము ఏదో ఒక్క విధముగ రైతు కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళమే. కనుక ఢిల్లీ లో జరుగు రైతు ఉద్యమములో ప్రత్యక్షముగా పాల్గొనలేక పోయిన ఆర్ధిక సహాయం చేయడం ద్వారా మనం పరోక్షముగా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావడమే. కనుక ఈ ఆర్థిక సహాయాన్ని ఈ నెల 23 తేదీ లోపు పంపాలని అనుకొంటున్నాము. మీరు ఈ క్రింది అకౌంట్ కు అమౌంట్ పంపగలరు. దేనికి సంబందించి ఏ డివిజన్ నుండి ఎంత మొత్తం వచ్చిందో వివరములు మరియు రైతు పోరాటానికి పంపిన ఆధారాలు పోస్టల్ యూనిటీ లో ను, కర్రపత్రం ద్వారా తెలుపబడును.రైతులు చేసే ఈ పోరాటం విజయవంతం కావాలని ఆశిస్తూ. మునుముందు రోజులలో ప్రత్యక్ష పోరాటాలకు సింద్దంగా ఉండాలని కోరుకొంటూ,
(POSB Account No.0492985227 A.venkatapaiah, Financial Secretary, Mangala giri)
విప్లవాభినందనలతో
బి.శ్రీధర్ బాబు
రాష్ట్ర కార్యదర్శి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి