*✊ఫిబ్రవరి '1' వ తేదీన నిరసన కార్యక్రమాలు✊*
*డియర్ కామ్రేడ్స్,*
*తపాలా శాఖలో దీర్ఘకాలంగా ఆవిరిష్కృతంగా ఉన్న న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ,నిలిపివేసిన కరువు భత్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి '1' వ తేదీన అన్ని తపాలా కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.అదే రోజు సాయంత్రం '5' గంటలకు రాజమండ్రి ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట భారీ సంఖ్యలో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి.సుమారు 50 రోజులుగా దేశ రాజధానిలో ఎముకలు కొరికే చలిలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ తమకు ఎదురులేదని విర్రవీగుతున్న మోడీ ప్రభుత్వాన్ని మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న రైతుల పోరాటస్పూర్తితో ప్రతీ ఒక్కరూ మన డిమాండ్ల పరిష్కారం కోసం చేసే ఈ పోరాటంలో భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తూ....*
*మీ*
*బి.కొండబాబు*